Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

OTT: థియేటర్లలో మెప్పించిన మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం!

Дата публикации: 06-10-2026 18:35:49



Основное содержимое страницы с новостью.

Published on Oct 7, 2026 12:04 AM IST

విలక్షణ నటి పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన తాజా మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్యా కుట్రక్కార్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు ముస్తాబైంది. ఓనమ్ సందర్భంగా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రాన్ని తమ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు సహా ఇతర ప్రధాన భాషల ఆడియోలతోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం.

ఈ చిత్రానికి షహద్ నిలంబూర్ దర్శకత్వం వహించారు. ఇందులో పార్వతితో పాటు మాథ్యూ థామస్, విజయరాఘవన్, సిద్ధార్థ్ భరతన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 11 ఐకాన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ సెల్వ ఈ చిత్రాన్ని నిర్మించగా, ముజీబ్ మజీద్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామాను వీక్షించవచ్చు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1Crime Drama Pradhama Drishtiya Kuttakkar Locks OTT Release Date – Here’s When and Where to Watch It01006-10-2026
2Naga Vamsi’s Epic Gets Its OTT Release Date; Netflix Confirms Multilingual Release08.406-10-2026
3Maremma: Ravi Teja’s Nephew Maadhav Bhupathiraju’s Film Locks OTT Date01006-10-2026
4The Paradise: Has Nani’s Film Locked Its OTT Release Date?01007-10-2026
5The Traitors Telugu trailer: Teja Sajja sets the tone for a thrilling game08.5206-10-2026
6Vimeo OTT: What's new in H1 202607.0407-08-2026
7❗ ПРЕМЬЕРА ❗ «Жeнcκий οтдeл» - Новый сериал смотрите в ...06.9430-09-2026
8ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎందులో అంటే!01006-10-2026
9Понять и простить: драмтеатр представил спектакль «Похороните меня за плинтусом»06.6928-09-2026
10Video : Saripoyaru Iddaroo Teaser (Meghamsh Srihari, Yashwin Vegesna)01006-10-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 10. Источник: www.123telugu.com.